Telangana BJP chief Ramchander Rao
* బీజేపీ తెలంగాణా చీఫ్ రామచందర్రావు
అకేరు న్యూస్, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు. యువత, విద్యార్థులు బీజేపీతోనే ఉన్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించేంతవరకు బీజేపీ ఉద్యమం కొనసాగుతుందని రామచందర్రావు స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలపై బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఇక 22A భూముల సమస్యతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. 22A బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారని చెప్పారు. బాధితుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడుతామని రామచందర్రావు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
