
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీలో ఎంపీటీసీ.జెడ్పీటీసీ ఎన్నికలకు
నోటిఫికేషన్ విడుదల అయింది.ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆగస్టు 1 న నామినేషన్లను స్వీకరిస్తారు. ఆగస్టు 2 న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 3న ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంటింది. అలాంటివి ఏమైనా ఎన్నికల సంఘం దృష్టికి వస్తే 4 న నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్ల ఉపసంహరణకు 5 వతేదీ గడువు విధించారు. ఆగస్టు 5 సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు 12 వతేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పోలింగ్ నిర్వహిస్తారు.ఎక్కడైనా రీపోల్ జరిగే అవకాశం ఉంటే 13న రీ పోలింగ్ ఉంటుంది. ఆగస్టు 14 న ఓట్ల లెక్కింపు ఉంటుంది 14 సాయంత్రం వరకు ఎన్నికల ఫలితాలు విడుదల అవుతాయి.
…………………………………..