Published:
Updated: 06 Nov 2024 • 10:58 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఇంటర్ ఎగ్జామ్ ఫీజు తేదీలు షెడ్యూల్ వచ్చింది. ఈ నెల 6వ తేదీ నుంచి 26వ తేదీ వరకు విద్యార్థులు ఫీజు చెల్లించాలి. రూ. 100 ఆలస్య రుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు చెల్లించొచ్చు. రూ. 500 ఆలస్య రుసుంతో డిసెంబర్ 5 నుంచి 11 వరకు, రూ. 1000 ఆలస్య రుసుంతో డిసెంబర్ 12 నుంచి 18 వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో డిసెంబర్ 19 నుంచి 27 వరకు చెల్లించే అవకాశం కల్పించారు. ఫస్టియర్ జనరల్ కోర్సులకు రూ. 520, వొకేషనల్ కోర్సులకు రూ. 750, సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సులకు రూ. 520, సైన్స్, వొకేషనల్ కోర్సులకు రూ. 750గా ఫీజు నిర్దారించారు.
……………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
