* ఘోరంగా 17 మర్డర్లు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఓ నర్సుకు కోర్టు 760 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆమె చేసిన హత్యలను తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం శిక్ష విధించింది. డాక్టర్ తర్వాత రోగులకు ప్రాణం పోయాల్సిన ఓ నర్సు మూడేళ్లలో 17 మందికి చంపేసింది. ఆమె ఇంకా ఎక్కువ మందిని చంపాలని చూసినా కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆ నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో నర్సు హీథర్ ప్రెస్డీ (41) 2020 నుంచి 2023 మధ్య కాలంలో ఆస్పత్రులకు వచ్చిన రోగులను 17 మందిని చంపేసింది. తాను పని చేసే ఆస్పత్రికి వచ్చిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హీథర్ ప్రెస్డీ హతమార్చేది. ఈ కేసు గురించి విన్న పెన్సిల్వేనియా కోర్టు.. సంచలన తీర్పునిచ్చింది. హీథర్ ప్రెస్డీకి 760 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ తుది తీర్పు వెలువరించింది. ఆ 3 ఏళ్లలో హీథర్ ప్రెస్డీ ఏకంగా 22 మందికి మోతాదుకు మించి ఇన్సులిన్ ఇచ్చింది. ఈ ఘటనలో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు.
———————–