* తొలిసారిగా తొలి టికెట్ వేలం
* రూ.1.29 లక్షలకు కొన్న వీరాభిమాని
* అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ రికార్డ్స్
* ప్రీ-రిలీజ్ వేడుక.. వర్షంలోనూ నిరీక్షణ
అకేరు న్యూస్, సినిమా ప్రతినిధి :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. టీజర్, పాటలు, పోస్టర్లలో పవన్ మాస్ లుక్ అభిమానులను ఇప్పటికే అలరిస్తోంది. వారి కళ్లల్లో ఆనందం కురిపిస్తోంది. దీనికితోడు సినిమా ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతోంది. టికెట్ల అమ్మకాల్లోనూ నూతన ఒరవడి మొదలైంది. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దసరా పండగ సందర్భంగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. డీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ జోడిగా ప్రియాంక మోహన్ కనిపించనుంది. వీరి కాంబినేషన్ లో విడుదలైన టీజర్లు, పాటలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవన్, ప్రియాంక జోడి ఆకట్టుకోనున్నట్లు తెలుస్తోంది.
ఒక్క టికెట్.. రూ.1.29 లక్షలు
డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిన ఓజీ సినిమాను నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో విలన్ గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించడం ఆసక్తిని రేకెత్తించింది. అలాగే ఎస్.ఎస్. తమన్ సమకూర్చిన సంగీతం ఇప్పటికే అభిమానులను అలరిస్తోంది. రిలీజ్ కు కొద్ది రోజులు ముందు నుంచే అంచనాలను పెంచేస్తోంది. ఇదిలాఉండగా తొలిసారిగా టికెట్ వేలం వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓ అభిమాని చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. చౌటుప్పల్‌లో పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నిర్వహించిన ఓజీ బెనిఫిట్ షో మొదటి టికెట్ వేలంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఈ వేలంలో 15 మంది అభిమానులు పాల్గొనగా, చివరికి ఈ టికెట్ ఏకంగా రూ. 1,29,999 కు అమ్ముడుపోయింది. ఈ టికెట్‌ను అముదాల పరమేష్ అనే వీరాభిమాని గెలుచుకున్నారు.
ఓవర్సీస్ లో రికార్డులు
ఇదిలా ఉంటే.. ఓవర్సీస్ లో ఓజీ రికార్డులు సృష్టిస్తుంది ఓజీ. తాజాగా నార్త్ అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ 2 మిలియన్స్ దాటిపోయాయి.ఇందుకు సంబంధించి మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఓజీ ర్యాంపేజ్ కంటిన్యూ అవుతుందని.. ఓవర్సీస్ లో మరిన్ని రికార్డులు సృష్టించబోతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలకు ఇంకా మూడు రోజుల సమయం ఉంది. కానీ ఇప్పటికే అటు బాక్సాఫీస్.. ఇటు ఓవర్సీస్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ అటు యూట్యూబ్ లో దూసుకుపోతున్నాయి.
స్టేజీపైకి కత్తి పట్టుకొని వచ్చిన పవన్
నిన్న జరిగిన ఓజీ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. జోరు వర్షంలోనూ ఫ్యాన్స్ పవన్‌కు జై కొట్టారు. మరోవైపు పవన్ కూడా అభిమానులను అలరించారు. ‘ఓజీ కన్సార్ట్’ పేరుతో నిర్వహించిన ఈ వేడుక స్టేజిమీదకు కత్తి పట్టుకొని వచ్చి ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు హీరో నేను కాదు సుజీత్ అన్నారు. అంతేకాదు.. వేదికపై డ్రమ్స్ శివమణి మ్యూజిక్ వాయిస్తుంటే మైక్‌తో అందరికీ వినిపించారు పవన్. ఈ కార్యక్రమంలో హీరోయిన ప్రియాంక మోహనన్, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మిలు పాల్గొన్నారు. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి విడుదల తర్వాత అంచనాలను అందుకుంటుందా.. లేదా వేచి చూడాలి.
………………………………………………..
