Ganesh Shobhayatra
* ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పటిష్ట భద్రత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఒకవైపు గణేష్ శోభాయాత్ర.. మరోవైపు శుక్రవారం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం ఇవ్వకుండా పోలీసులు చార్మినార్ పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. రంగంలోకి ఆరు కంపెనీల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లు, 27 మంది ట్రైన్ ఐపీఎస్‌లు రంగంలోకి దిగారు. చార్మినార్ పోలీస్ స్టేషన్లో కంట్రో రూమ్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
* బందోబస్తులో 5వేల మంది
ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాల్లో బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. మరి కాసేపట్లో చార్మినార్ మీదుగా బాలాపూర్ గణేష్ శోభాయాత్ర (Ganesh Shobhayatra) సాగనుంది. ఈ నేపథ్యంలో లైన్ క్రాస్ చేస్తే జైలుకే అంటూ పోలీసులు వార్నింగ్ మెసేజ్ ఇస్తున్నారు. చార్మినార్ పరిసరాల్లో కనివినీ ఎరుగని సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. దాదాపు 5000 మంది పోలీసులతో కట్టు దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
* కమాండ్ కంట్రోల్ రూం నుంచి సీపీ..
ఉన్నతాధికారులు కూడా చార్మినార్ ప్రాంతంపై నిఘా పెట్టారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కూడా పరిస్థితులను సమీక్షించారు. శుక్రవారం మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు ఉండడం.. అదే సమయంలో బాలాపూర్ గణేష్ పాదయాత్ర అటువైపు వెళ్లే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు ఇరువర్గాలతో చర్చించారు.
ఒకరికొకరు సహకారం అందించుకుంటామని మత పెద్దలు హామీ ఇవ్వడంతో ప్రశాంతత వాతావరణం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహృద్భావ వాతావరణం ఉంది. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా పోలీసులు భద్రత కొనసాగిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
