TG TET Results 2026
* రేపే టెట్ ఫలితాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం నిర్వహించిన టీజీ టెట్ పరీక్ష ఫలితాలు రేపు (సెప్టెంబర్ 26) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ వెల్లడించింది.
ఇటీవల సెప్టెంబర్ 8, 9 తేదీల్లో ఇన్-సర్వీస్ టీచర్ల కోసం టెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 24 వేల మందికి పైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఫలితాలు విడుదలైన అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఫలితాలను పరిశీలించుకోవచ్చు.
ఫలితాల కోసం అభ్యర్థులు https://tgtet.aptonline.in/వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇన్-సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలంటూ సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరీక్షను నిర్వహించారు. దీంతో ఈ ఫలితాలపై ఉపాధ్యాయుల్లో ఆసక్తి నెలకొంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
