
* ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, రాజస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్
ఆకేరు న్యూస్, స్పోర్ట్స్ డెస్క్ : హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో హైదరాబాద్, రాజస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ (CRICKET MATCH) ప్రారంభమైంది. మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేశారు. భద్రతా సిబ్బంది అందరినీ క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలకు పంపించారు. ఐపీఎల్(IPL) మ్యాచ్కు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,700 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం, పరిసరాల్లో 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు స్టేడియంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. స్టేడియం పరిసరాల్లో 5 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. మహిళ భద్రత కోసం మరిన్నిప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్టేడియంలోని కొన్ని వస్తువులను నిషేధించారు. వాటర్ బాటిళ్లు, అగ్గి పెట్టెలు, ఎలక్ట్రానిక్ వస్తువులను నిషేధించారు. షీ టీమ్స్ ను రంగంలోకి దింపారు. టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ (RAJASTHAN ROYALS) ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, సన్రైజర్స్ మ్యాచ్ టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నలుగురిపై కేసు నమోదైంది. టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న మొత్తం ఏడుగురిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా మ్యాచ్ ఉన్న రోజుల్లో హైదరాబాద్లో మెట్రోరైళ్లు అర్ధరాత్రి వరకూ నడవనున్నాయి.
…………………………………….