
* నేడు వడగళ్ల వాన పడే అవకాశం
* ఏడు జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rains) కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. వరంగల్(Warangal), హనుమకొండ, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్(Karimnagar), ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదా ద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్(Hyderabad), మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఏడు జిల్లాలకు ఆరెంజ్, 22 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
………………………………