
* కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్
* కేసీఆర్ ఓ పుస్తకంలో రాసిన ముందుమాటలోని పదాలను గుర్తుచేసిన మల్లన్న
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః ఎమ్మెల్సీ కవిత తీరుపై తీన్మార్ మల్లన్న ధ్వజమెత్తారు. కవిత తన అనుచరులతో చేయిస్తున్న అరాచకాలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు మల్లన్న తెలిపారు. కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చైర్మన్ ను కోరినట్లు తెలిపారు.1017లో బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన తెలుగు మహాసభల సందర్భంగా
ప్రచురించిన ఓ పుస్తకానికి కవిత తండ్రి కేసీఆర్ ముందుమాట రాశారని గుర్తుచేశారు. ఆ పుస్తకంలె కంచం పొత్తు మంచం పొత్తు అనే పదాలను కేసీఆర్ వాడారని మల్లన్న గుర్తుచేశారు.తెలంగాణలో అలవాటుగా అనాదిగా వస్తున్న పదాలపై విపరీతార్థాలు తీయడం సరికాదన్నారు. తెలుగు భాషపై తెలుగు వ్యాకరణంపై తనకు పట్టు ఉందని ఏ పదాలు ఎప్పుడు ఎలా వాడాలో తనుకు బాగా తెలుసునని తీన్మార్ మల్లన్న అన్నారు. దొరసానికేం తెలుసు తెలంగాణ బీసీల భాష అని పరోక్షంగా ఎద్దేవా చేశారు. బీసీల ఉద్యమాన్ని ఆపేందుకు కవిత కుట్ర చేస్తోందని మల్లన్న విమర్శించారు. బీసీల రిజర్వేషన్లు తగ్గించింది కేసీ ఆర్ కాదా అని మల్లన్న ప్రశ్నించారు.
……………………………………..