* శంషాబాద్ లో ఆపరేషన్ చిరుత
* 9 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫెన్సింగ్ దూకి శంషాబాద్ ఎయిర్పోర్టు రన్ వే పైకి వచ్చిన చిరుత ను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ( Operation leopard ) వేట కొనసాగిస్తున్నారు. 9 ట్రాప్కెమెరాలు, ఒక బోను ఏర్పాటు చేశారు. ఆ బోనులో మేకను ఉంచి.. పులిని పట్టుకునేందుకు ప్లాన్ వేశారు. ఫెన్సింగ్ దూకి రన్ వే పైకి వచ్చినట్లుగా నిన్న కెమెరాలో రికార్డు అయింది .. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లింది.., ఎటు వెళ్లింది అనే జాడ కనిపించ లేదు. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఫారెస్టు అధికారులు చిరుతను పట్టుకునే పనిలో ఉన్నారు.
* చిరుతతో పాటు రెండు పిల్లలు
నిన్న తెల్లవారుజామున 3..30 గంటల ప్రాంతంలో శంషాబాద్ మునిపల్ పరిధి గొల్లపల్లి వద్ద ఎయిర్ పోర్టు ప్రహరీ దూకుతుండగా, ఫెన్సింగ్ వైర్లకు చిరుత తగలడంతో ఎయిర్ పోర్ట్ కంట్రోల్ రూమ్ లో అల్లారం మోగింది. దీంతో అప్రమత్తమైన అధికారులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఓ చిరుత రన్వే పైకి వచ్చినట్లు గుర్తించారు. చిరుతతోపాటు రెండు పిల్లలు కూడా ఉన్నట్లు కెమెరాలో రికార్డయింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు ఆపరేషన్ చిరుత ప్రారంభించారు. మూడేళ్ల క్రితం కూడా ఇక్కడ చిరుత కలకలం రేపింది.
———————