సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీఏ ప్రతినిధి బృందం
* టీటీఏ సమావేశానికి ఆహ్వానం
* సానుకూలంగా స్పందించిన సీఎం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ( Telangana American Telugu Association ) ప్రతినిధులు ఆదివారం కలిశారు. మే నెల 24 తేదీ నుంచి 26 వరకు అమెరికాలోని సియాటెల్ లో జరిగే మెగా ఈవెంట్ కన్వెన్షన్‌కు హాజరు కావాలని ఆహ్వానించారు. సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సమావేశానికి తెలంగాణలోని ప్రముఖులను ఆహ్వానించేందుకు టీటీఏ ( TTA ) ప్రతినిధి బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. .సీఎం ను కలిసిన వారిలో టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్స్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి, నవీన్ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్ ఎల్ఎన్ రెడ్డి దొంతిరెడ్డి తోపాటు ఈసీ, బీవోడీ జ్యోతి రెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్ సెలోజ్ లు ఉన్నారు.
—————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
