* ఓయూలో భగ్గుమన్న నినాదాలు
ఆకేరు న్యూస్, హదరాబాద్ :
కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ ఎస్వీ ధర్నా చేపట్టింది. ఆందోళన చేస్తున్న బీఆర్ ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ముఖ్యమంత్రిరేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట జరిగింది. రేవంత్ రెడ్డి డౌన్.. డౌన్ అంటూ బీఆర్ ఎస్వీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
