* జాహ్నవి కుటుంబానికి ₹240 కోట్ల భారీ పరిహారం
ఆకేరు న్యూస్, డెస్క్ : అమెరికాలో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల (23) కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది. సుదీర్ఘ పోరాటం తర్వాత, సీటెల్ నగర యంత్రాంగం బాధితురాలి కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో సుమారు ₹243 కోట్ల పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.
* అసలేం జరిగింది..? అహంకారపు నవ్వుకు బారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. అమెరికాలోని సీటెల్ సిటీ లో రోడ్డు దాటుతున్న జాహ్నవి కందుల అనే భారతీయ విద్యార్థినిని పోలీస్ వాహనం ఢీ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన పోలీస్ అధికారి ఆమె మృత దేహాన్ని ఉద్దేశించి నవ్వుతూ అవహేళన చేశాడు . సీటెల్ సీటీ కౌన్సిల్ జాహ్నవి కుటుంబానికి ఏకంగా రూ. 249 కోట్ల భారీ పరిహారం ప్రకటించింది. అమెరికాలోని సీటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్కర్నూల్ కు చెందిన జాహ్నవి కందుల, రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీకొట్టింది. ఈ సంఘటన 2023 జనవరి 23 న జరిగింది. ఆ సమయంలో సదరు పోలీస్ అధికారి కెవిన్ డేవ్, ఒక అత్యవసర కాల్ (Overdose Call) నిమిత్తం గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడుపుతున్నాడు. ఈ ప్రమాదంలో జాహ్నవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. . ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డానియల్ ఆడెరర్, ఆమె ఒక సాధారణ వ్యక్తి, కేవలం 11,000 డాలర్ల చెక్ రాసిస్తే సరిపోతుంది. అంటూ జాహ్నవి మృతిని ఎగతాళి చేస్తూ నవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించింది. భారత ప్రభుత్వంతో పాటు అమెరికాలోని ప్రవాస భారతీయులంతా ఒక్క సారిగా షాక్ కు గురయ్యారు.
* 29 మిలియన్ డాలర్ల పరిహారం
జాహ్నవి కుటుంబం సీటెల్ నగర అధికారులపై సివిల్ దావా వేసింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతురు చనిపోయిందని కోర్టులో వాదించారు. పోలీస్‌ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుండటంతో, కేసును సుదీర్ఘ కాలం లాగ కుండా సెటిల్మెంట్ చేసుకోవాలని సీటెల్ సిటీ కౌన్సిల్ నిర్ణయించింది. వేగ పరిమితిని మించి వాహనం నడపడం మరియు ప్రాథమిక భద్రతా నియమాలను పాటించకపోవడం లాంటివి పోలీస్ అధికారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిని కౌన్సిల్ భావించింది. దీంతో సీటెల్ సిటీ కౌన్సిల్ భారీ పరిహారాన్ని ప్రకటించింది.
* నా బిడ్డ ప్రాణాలను అవహేళన చేయడం నచ్చలేదు..“డబ్బు మా బిడ్డను తిరిగి తీసుకురాలేదు, కానీ ఆమె విలువను తక్కువ చేసిన వారికి ఇది ఒక గుణపాఠం” అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. జాహ్నవి కుటుంబం ఈ పరిహారంతో ఆమె పేరు మీద ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి, విద్యార్థులకు సాయం చేయాలని భావిస్తోంది.
————–
