Palakurthi Tree Plantation
ఆకేరు న్యూస్,పాలకుర్తి:
మొక్కలను నాటడం వల్లనే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని పర్యావరణం అందుతాయని పాలకుర్తి ఎంపీడీఓ వేదవతి పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి ఫంక్షన్ హాల్ ఆవరణలో స్థానిక గ్రామ సర్పంచ్ కమ్మగాని విజయ్ నాగన్న గౌడ్, మరియు గ్రామపంచాయతీ వార్డు సభ్యులతో కలిసి ఎంపీడీఓ వేదవతి మంగళవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ— పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ప్రాంగణాల్లో మరియు ఖాళీ స్థలాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
సర్పంచ్ కమ్మగాని విజయ్ నాగన్న గౌడ్, మాట్లాడుతూ— పాలకుర్తిని పచ్చని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఫంక్షన్ హాల్ ఆవరణను ఆహ్లాదకరంగా మార్చేందుకే ఈ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టామని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు వీరమనేని హనుమంతరావు, కమ్మగాని సుధాకర్ గౌడ్, నెమరు గుమ్ముల శ్రీనివాసరావు, కమ్మగాని శ్రీకాంత్ గౌడ్, కత్తి దస్తగిరి, సెక్రటరీ శ్రీనివాసరావు, ఫంక్షన్ హాల్ మేనేజర్ జీవన్ జీ వినయ్ మహిళా సంఘ సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
