Telangana Tourism Development
* వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు
ఆకేరు న్యూస్,ములుగు:
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, ప్రతి జిల్లాలోని పర్యాటక ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు
జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ములుగు కలెక్టరేట్ (ఐడిఓసి) నుంచి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఎస్ పి సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ,
రాష్ట్ర వ్యాప్తంగా
ఆధ్యాత్మిక, చారిత్రక, వారసత్వ, ఎకో టూరిజం, హస్తకళలు, జల పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అనుసంధానిస్తూ పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో రహదారులు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, శుభ్రత, సూచిక బోర్డులు, ఇతర సందర్శకుల సౌకర్యాలను మెరుగుపరచాలని సీఎస్ ఆదేశించారు.
ప్రతి ప్రత్యేక పర్యాటక ప్రాంతానికి స్పష్టమైన అభివృద్ధి కార్యాచరణ, బాధ్యతలు, కాలపరిమితి రూపొందించి పనుల పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని సూచించారు. స్థానిక కళలు, హస్తకళలు, స్థానిక ఆహారం, సంస్కృతికి ప్రాధాన్యతనిస్తూ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని సీఎస్ తెలిపారు.
ఆగస్టు 30న నిర్వహించనున్న నీట్–పీజీ 2026 ప్రవేశ పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎస్ ఆదేశించారు.
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో 17,627 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుందని, అభ్యర్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం, విద్యుత్, జనరేటర్ బ్యాకప్, వెలుతురు, వెంటిలేషన్ తదితర మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉండేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సీఎస్ తెలిపారు. అభ్యర్థుల గుర్తింపు, తనిఖీలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని, మొబైల్ ఫోన్లు, బ్లూటూత్ పరికరాలు, ఏఐ గ్లాసెస్, స్పై కెమెరాలు తదితర నిషేధిత వస్తువులను అనుమతించరాదని, ప్రశ్నాపత్రాల భద్రత, గోప్యతకు పూర్తి రక్షణ కల్పించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 22 శాతం లోటు వర్షపాతం నమోదైందని, సెప్టెంబర్ చివరి వరకు పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు సూచించినట్లు సీఎస్ తెలిపారు.
* ఈ వీడియో కాన్ఫరెన్స్ లో
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వివిధ పర్యాటక కేంద్రాల విశిష్టతను విస్తృతంగా ప్రజలకు చేరువ చేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల ద్వారా షార్ట్ ఫిలిం, ప్రచార వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో
డిఈఓ సిద్ధార్థ రెడ్డి, డిఐఓ వీరేoదర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
