Mulugu Press Club Building
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లా కేంద్రంలో పాత్రికేయులకు ప్రత్యేక ప్రెస్ క్లబ్ కోసం భవనాన్ని కేటాయించాలని స్థానిక పాత్రికేయులు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడిఓసి) లో మంగళవారం జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లేకపోవడం తో అధికారులు, ప్రజా ప్రతినిధులు విలేకరుల సమావేశాలను నిర్వహించాలంటే చెట్లను ఆశ్రయించాల్సి వస్తున్నదని వివరించారు. గట్టమ్మ వద్ద నూతన కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైన అనంతరం అన్ని జిల్లా శాఖల కార్యాలయాలు నూతన భవనంలోకి మార్చడం తో గతంలో పౌర సంబంధాల శాఖ కు కేటాయించిన భవనాన్ని ప్రెస్ క్లబ్ కు ఇవ్వాలని ఆ వినతి పత్రంలో పాత్రికేయులు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గుర్రం శ్రీధర్, ఎండి షఫీ, జినుకల ప్రభాకర్, జాలిగం శ్రీను, ఎనగందుల కొమురయ్య, చల్లగురుగుల రాజు, ఆవుల వెంకన్న, కంచర్ల రాజు, పొన్నాల స్వామి, చల్లూరి మహేందర్, ఎలక్ట్రానిక్ మీడియా, వివిధ పత్రికల పాత్రికేయులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
