ఆకేరు న్యూస్, సినిమా ప్రతినిధి
ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు.. అతడే ప్రభాస్. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు డార్లింగ్. ఆయన తన అభిమానులను కూడా డార్లింగ్స్ అనే పిలుచుకుంటాడు. ఆయనకు వారసత్వంగా వచ్చిన మరో పేరు రెబల్ స్టార్. కృష్ణంరాజు వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్ తర్వాత తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తో తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ప్రభాస్a పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఈరోజు పండగల జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆకేరు న్యూస్.. కూడా విషెస్ చెబుతూ ప్రత్యేక కథనం..
అత్యధిక వసూళ్ల హీరో
2002లో ఈశ్వర్ అనే సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసినప్రభాస్ తరవాత యాక్షన్ రొమాంటిక్ చిత్రం వర్షం (2004) తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఛత్రపతి (2005), బుజ్జిగాడు (2008), బిల్లా (2009), డార్లింగ్ (2010), మిస్టర్ పర్ఫెక్ట్ (2011), మరియు మిర్చి (2013) వంటివి మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి. ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా గెలుచుకున్నారు. బాహుబలి: ది బిగినింగ్ (2015), దాని సీక్వెల్ బాహుబలి 2 ది కన్‌క్లూజన్ (2017) ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేశాయి. అత్యధిక రెమ్యునేషన్ తీసుకునే హీరోల్లో ఒకడిగా నిలబెట్టాయి. అంతేకాదు.. బాహబలిలో తన నటనకు అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆ తర్వాత వచ్చిన సాహో (2019), యాక్షన్ డ్రామా సాలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్ (2023), మరియు సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 AD (2024) అత్యధిక వసూళ్లను సాధించాయి.
ప్రభాస్ కెరీర్లో కొన్ని విశిష్టతలు
* ప్రభాస్ ప్రతీ సినిమాకు ₹80 కోట్ల నుంచి ₹150 కోట్ల వరకు వసూలు చేస్తారని ఇండస్ట్రీ టాక్.
* ఆయనకు ఉన్న బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా ప్రతి సంవత్సరం ₹50 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది.
* ప్రభాస్‌కి లగ్జరీ కార్లంటే ప్రత్యేక ఇష్టం. ఆయన గ్యారేజీలో ఉన్న హై-ఎండ్ వాహనాల జాబితా లో రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లాంబోర్గినీ అవెంటడార్ రోడ్‌స్టర్, జాగ్వార్ XJR, BMW X3 ఉన్నాయి.
* ప్రభాస్ తొలిసారిగా బాలీవుడ్లో ఆక్షన్ జాక్సన్ చిత్రంలో గెస్ట్ రోల్ చేశారు.
* ప్రపంచవ్యాప్తంగా ₹ 100 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ సాధించిన ఆరు చిత్రాలను కలిగి ఉన్న ఏకైక భారతీయ నటుడు
* హిందీ మార్కెట్లో ₹ 100 కోట్ల నికర వసూళ్లను దాటిన ఆరు చిత్రాలను కలిగి ఉన్న ఏకైక దక్షిణ భారత నటుడు.
* ప్రపంచవ్యాప్తంగా ₹ 1000 కోట్లకు పైగా సినిమా వసూళ్లను సాధించిన మొదటి భారతీయ నటుడు.
* మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు శిల్పాన్ని అందుకున్న మొదటి దక్షిణ భారత నటుడు.
* 2004లో ప్రభాస్ నటించిన వర్షం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
* అతను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు నామినేషన్ అందుకున్నారు.
* 2005లో యాక్షన్ డ్రామా ఛత్రపతిలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 54 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది.
* 2010లో, అతను రొమాంటిక్ కామెడీ డార్లింగ్‌లో నటించారు.
* బాహుబలి విజయం ప్రభాస్‌ను భారతీయ సినిమాలోని మొదటి ” పాన్-ఇండియన్ ” స్టార్‌గా మార్చింది , భారతదేశం అంతటా అభిమానులను తెచ్చి పెట్టింది.
