MLA Mahipal Reddy accident
* పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ప్రమాదం
హైదరాబాద్: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లోని బాత్రూమ్లో ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి.
*ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడటంతో గాయాలు*
ఈరోజు ఉదయం తన నివాసంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా కాలు జారి పడిపోవడంతో మహిపాల్ రెడ్డికి గాయాలయ్యాయి. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై, ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
*ఆందోళన చెందాల్సిన అవసరం లేదు*
ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కనీసం రెండు రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరో రెండు రోజుల పాటు ఆయన ఆసుపత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు.
*కార్యకర్తలు ఆందోళన*
ఎమ్మెల్యేకు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనకు గురయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
