* అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్
* జనసేన ఎమ్మెల్యేల సాదర స్వాగతం
* ఎమ్మెల్యేతో పాటు ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం
* అభిమానుల్లో ఆనందోత్సాహం
* చంద్రబాబు, పవన్ ఆలింగనం
* ఆ ఇద్దరి మీదే అందరి కళ్లు
ఆకేరు న్యూస్, విజయవాడ : పవన్ కల్యాణ్(Pawan Kalyan) అభిమానుల కళ్లుచెమర్చిన ఆనంద క్షణాలు.. ఆయనను అమితంగా ప్రేమించే జనసైనికుల హృదయం ఉప్పొంగిన ఘడియలు.. పవన్ అసెంబ్లీ(Assembly)లో అడుగుపెడుతుంటే.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది!’ అంటూ గతంలో పవన్ చేసిన స్టేట్మెంట్(Pawan’s statement) ను గుర్తుచేసుకుని సంబరపడిపోయారు. అవును.. నిజంగానే ఆయనను ఆపలేకపోయారు. పదేళ్ల కష్టానికి ప్రతిఫలం లభించింది. ఎమ్మెల్యే(MLA)గా మాత్రమే కాదు.. ఏకంగా ఉప ముఖ్యమంత్రి (Deputy CM) హోదాలో అసెంబ్లీలో అడుగుపెట్టారు.
పులకించిన ఫ్యాన్స్
‘పవన్ (Pavan)ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం’ అంటూ చాలా మంది వైసీపీ(YCP) నేతలు సవాల్ విసిరారు. అధికారగర్వంతో, నోటిదురుసుతో ప్రవర్తించారు. దీనికి కౌంటర్ గా ఓ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. మనల్ని ఎవడ్రా ఆపేది.. అంటూ అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం ( AP Deputy CM) హోదాలో తొలిసారి అసెంబ్లీ (Assembly) లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ను చూసి ఫ్యాన్స్ (Fans) ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కొణిదెల పవన్ కల్యాణ్(Konidela Pawan Kalyan).. అను నేను అంటూ ఆయన ప్రమాణం చేస్తున్న మాటలను టీవీల ద్వారా విని పులకించిపోయారు. అలాగే.. గతంలో శాసనసభలో జరిగిన అవమానం తర్వాత.. ఈ కౌరవసభకు ఇక నేను రాను.. మళ్లీ ముఖ్యమంత్రిగానే గౌరవ సభలో అడుగుపెడతానని శపథం చేసిన చంద్రబాబు కూడా ఈసారి ఆకర్షణీయంగా మారారు. అసెంబ్లీలో అడుగుపెట్టిన వెంటనే చంద్రబాబు(AP CM Chandrababu), పవన్(Pavan) ఆలింగనం చేసుకున్నారు. దీంతో అందరి కళ్లూ ఆ ఇద్దరిపైనే ఉన్నాయి.
—————————