* చెంచు మహిళను వివస్త్రను చేసి, కళ్లు, మర్మాంగాళ్లో కారం
* నాగర్‌కర్నూలులో అమానవీయ ఘటనపై ప్రజాగ్రహం
* నేషనల్ లేబర్ కమిషనర్‌కు, కలెక్టర్‌కు ఫిర్యాదులు
* మంత్రి జూపల్లి సీరియస్.. పాశవిక చర్యపై ఖండన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
ఓ చెంచు మహిళ (Chenchu woman) పట్ల కౌలుదారులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. తీవ్రంగా హింసించారు. పచ్చిమిరపకాలు దంచి, కారం పట్టి ఆమె కళ్లల్లో, మర్మాంగాల్లో చల్లారు. అంతటితో వారి క్రూరత్వం చల్లారలేదు. చెప్పుకోలేని స్థానంలో డీజిల్ పోసి నిప్పంటించారు. ఆమె పొలాన్ని కౌలుకు తీసుకుని.. ఆమెపైనే మృగాళ్లా వ్యవహరించారు. ఇంతకీ ఆమె చేసిన నేరం కొద్ది రోజులుగా పనికి రాకపోవడమే. నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District) కొల్లాపూర్ మండలం (Kollapur Mandal) మొలచింతలపల్లి (Molachinthalapalli) గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటనపై ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
అసలు ఏం జరిగిందంటే..
బండి శివమ్మ, బండి శివుడు, బండి వెంకటేశ్వర్లు (Bandi Venkateshwarlu) బాధిత కుటుంబానికి చెందిన భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలుకిచ్చిన భూమిలోనే ఆ మహిళ, ఆమె భర్త పనిచేసేవారు. పది రోజుల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఆమె అలిగి పుట్టిల్లయిన తీర్నాంపల్లి (Thirnampally) కి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోంచి బయటపడింది. అయితే ఆమె ఆ గ్రామానికి కాకుండా పరిచయస్తులు ఉన్న చుక్కాయిపల్లి (Chukkaipally) గ్రామానికి వెళ్లింది. భార్య గురించి అత్తామామలకు భర్త ఫోన్ చేసి అడగ్గా, ఆమె తమ ఇంటికి రాలేదని వారు చెప్పారు. దీంతో భార్య గురించి ఆందోళన చెందుతుండగానే మరోవైపు కౌలుదార్లు అయిన శివమ్మ, వెంకటేశ్వర్లు, శివుడు.. ఆమె ఆచూకీని గుర్తించి చుక్కాయిపల్లికి వెళ్లారు. ఆమెకు మాయమాటలు చెప్పి గ్రామంలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ ఆమెను నిర్బధించి దాష్టీకాలకు పాల్పడ్డారు. చెంచు నాయకులు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పౌర సంఘాలు ఆగ్రహం
ఆమె నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమెను చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వాస్పత్రికి (Kollapur Governament hospital) తరలించారు. ఘటనపై పౌర హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులు వెంకటేశ్వర్లు (Bandi Venkateshwarlu), శివుడు( Shivudu), శివమ్మ(Shivamma) పై కిడ్నాప్, ఎస్సీ(SC), ఎస్టీ(ST) అట్రాసిటీ కేసు (Atrocity Act) నమోదు చేయాలని పౌర హక్కుల సంఘం ప్రతినిధులు కొల్లాపూర్ డీఎస్పీ శ్రీనివా్‌స(Kollapur DSP Srinivas) కు వినిపత్రమిచ్చారు. చెంచు మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని మంత్రి జూపల్లి (Minister Jupally) ఆదేశించారు. చెంచు మహిళపై దాడి ఘటనలో ముగ్గురు నిందితులతో పాటు బాధితురాలి అక్క, బావ కూడా ఉన్నట్లు డీఎస్పీ (DSP) చెప్పారు. వీరిలో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మహిళను ఇంట్లో నిర్బంధించిన విషయం బయటకు పొక్కడంతో గ్రామంలోని కొందరు మహిళలు నేషనల్ లేబర్ కమిషన్ (National Labor Commission) కు ఫిర్యాదు చేశారు. ఆదివాసీ సంఘం సభ్యుడు వెంకటస్వామి కలెక్టర్ (Venkataswamy Collector)కు ఫిర్యాదు చేశారు.
మంత్రి జూపల్లి ఆరా
చెంచు మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై ఎక్సైజ్(Excise), పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism Minister Jupalli Krishna Rao) స్పందించారు. పాశవిక దాడిని ఖండించి, విచారం వ్యక్తం చేశారు. బాధిత మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి పాశవిక దాడులకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ (District SP Vaibhav Gaikwad) కు ఫోన్ చేశారు. కేసు దర్యాప్తు పురోగతిపై మంత్రి ఆరా తీశారు.
————————–