* ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన
* అమిత్‌షాను తొలగించాలని పిసిసి డిమాండ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: అంబేడ్కర్‌పై కేంద్రమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నేడు కాంగ్రెస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో రాష్ట్ర నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దేశ ప్రజల గుండెల్లో గాయమైందని.. తమకు దైవ సమానమైన అంబేద్కర్ గురించి అమిత్ షా చులకనగా మాట్లాడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై నమ్మకమున్న ప్రతి పౌరుడిని అమిత్ షా మాటలు బాధ పెట్టాయన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
