
ఆకేరు న్యూస్, జనగామః మోహరం పండుగ వచ్చిందంటే పాలకుర్తి ప్రాంత ప్రజలకు ఎక్కడ లేని సంబురం ఒస్తది. మతాలకు అతీతంగా జరుపుకునే ఈ పండుగలో ఒక కొత్తదనం, ఒక జోష్ పాలకుర్తి ప్రజలకు రావడం విశేషం. వాస్తవానికి మోహరం పండుగ ముస్లీంలది అయినప్పటికి హిందువులు కూడా ఈ పండుగను తమ సొంత పడుగగా జరుపుకుంటారు. కారణం లేకపోలేదు.. ఊరులోని పీరిల కొట్టం వద్ద ఒక ప్రత్యేకమైన ఆగ్నిగుండం తయారు చేసి రాత్రి వేళల్లో పెద్ద పెద్ద మంటలు వేసి దాని చుట్టు పురుషులు ఒక లయబద్దంగా ఎగురుతూ.. గంతులేస్తూ.. పాటలు పాడుతూ.. తన్మయత్వంతో ఊగిపోతుంటారు. దీనిని అందరు హాల్వ అంటారు. ఇక పీరిలను ముస్తాబు చేసి గ్రామంలో ఊరేగిస్తూ సంబరాలు చేసుకుంటారు. ఈ పీరిల పండుగలో ముస్లీంలు, హిందువులు కలిసి మెలిసి జరుపుకోవడం మనం చూస్తుంటాం. పీరీలు.. హాల్వా ఇది అంతా ఒక పండుగ.. ఒక మతవిశ్వాసం అయితే.. ఇక పాలకుర్తిలో మాత్రం హిందువులు ఆరాధించేవారి వేశాలను వేసి ప్రజలను అలరిస్తారు. ఇందులో ప్రధానంగా మాయల ఫకీరు, సత్య హరిచంద్రుడు, కాటికాపరి, లక్ష్మణుడు, ఇంకా అనేక రకాలైన వేశాలను వేసి, తమ విన్యాసాలతో ప్రజలను మైమరిపింప చేస్తారు. ఇందులో ప్రధానంగా చెప్పుకునేది శూర్ఫణఖ వేశం. ఈ వేశాన్ని పాలకుర్తి పట్టణానికి చెందిన బండి కొండయ్య గత 50ఏండ్లుగా వేస్తూ ప్రజలను రంజింప చేస్తున్నాడు. ఆదివారం కూడా తాను శూర్ఫణఖ వేశం వేసి పాలకుర్తి పురవీధుల్లో ఊరేగింపుగా తిరగడంతో పిల్లాపాపల నుంచి పండు ముసలి వరకు ఆనంద పరవశం అయ్యారు. శూర్ఫణఖ వేశం తయారు చేసుకున్న తీరు.. వేశధారణ ప్రజల ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుంది. అయినా కూడా ప్రజలు ఆనంద పడటం విశేషం. శూర్ఫణఖ వేశం వేసిన బండి కొండయ్య మాట్లాడుతూ తాను గత 50ఏండ్లుగా వేస్తున్నానని, తాను 20ఏండ్ల వయస్సు నుంచి ఇలా వేశం వేసి ప్రజలను రంజింప చేస్తున్నాని అన్నారు.
…………………………………..……………