Published:
Updated: 29 Nov 2024 • 05:23 AM
ఆకేరున్యూస్, శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులుతీశారని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్సీఎస్) తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 5.8 తీవ్రత నమోదైనట్లు పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్, తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడిరచింది. భూమి లోపల 209 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు వివరించింది.
…………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
