* పిడికెడు మంది సభ్యులు సభను అడ్డుకుంటారు
* ప్రజల ఆకాంక్షలను సభ్యులు అర్థం చేసుకోవాలి
* పార్లమెంట్ సమావేశాలకు ముందు విపక్షాలపై మోదీ విమర్శలు
* నేటి నుంచి శీతాకాల సమావేశాల ప్రారంభం
* మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం
ఆకేరు న్యూస్, ఢిల్లీ : ప్రజల ఆకాంక్షలను విపక్షాలు అర్థం చేసుకోవడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PRIME MINISTER NARENDRA MODI) విమర్శించారు. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (PARLIAMENT WINTER SESSION) ప్రారంభంకానున్న నేపథ్యంలో మాట్లాడిన ఆయన.. సమావేశాలకు ముందే విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అధికార దాహం గల పార్టీలను ప్రజలు తిరస్కరించారని గుర్తుచేశారు. అలాంటి పార్టీలు ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకోలేవని, అందుకే పదే పదే అలాంటి పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు నిర్మాణాత్మకంగా సాగాలని కోరుకుంటున్నా అన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయిందన్నారు. పార్లమెంట్ చర్చల్లో సభ్యులందరూ పాల్గొనాని కోరారు. పిడికెడు మంది సభ్యులు సభను అడ్డుకుంటున్నారని, సొంత లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆకాంక్షలను సభ్యులు అర్థం చేసుకోవాలని సూచించారు. కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఇండియా కూటమి(INDIA) నేతలు సమావేశం అయ్యారు. కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే(MALLIKARJUN KHARGE)నివాసంలో వీరు భేటీ అయి, సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
