* ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి
* బిల్డ్ నౌ యాప్‌ను ప్రారంభించిన ప్రభుత్వం
ఆకేరున్యూస్, హైదరాబాద్: భవనాలు, లే అవుట్ల అనుమతులకు ’బిల్డ్ నౌ’ పేరుతో కొత్త ఆన్లైన్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాగా.. ’బిల్డ్ నౌ’ పేరుతో ఏర్పాటు చేసిన యాప్‌తో పాటు, విధానాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణాభివృద్ధిలో గతంలో లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మంది జనాభా పట్టణ, నగర ప్రాంతాల్లో ఉంటున్నందున ఈ శాఖ ప్రాధాన్యతపై దృష్టి పెట్టి స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఈ అత్యాధునిక వ్యవస్థ భవన నిబంధనలు , అనుమతులకు సంబంధించి ప్రజల అవసరాలను వేగంగా తీర్చడంతో పాటు విశ్వసనీయంగా.. స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అభివృద్ధి నివేదికను ప్రజల ముందు పెడుతున్నామన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఐటి సెంటర్లు హైదరాబాద్‌లో ఉన్నాయని.. హైదరాబాద్ నగరం ప్రపంచంలోని ఐదు నగరాల్లో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. హైదరాబాద్ మహా నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. సరళికృత మార్పులు తేవాలని భావిస్తున్నామని.. పౌర సేవలను సరళీకృతం చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడిరచారు.
……………………………………..