ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. నిందితుల, బాధితుల స్టేట్ మెంట్లను రికార్డు చేస్తోంది. వరుసగా విచారణలు చేపడుతూనే ఉంది. ఎస్ ఐడీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు (Prabhakar rao) మరోసారి ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన విచారణకు హాజరు కావడం ఇది నాలుగోసారి. ఈనెల 9, 11, 14న కూడా ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు ఆయనను విచారించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డీఎస్ పీ ప్రణీత్రావును కూడా విచారించే అవకాశం కనిపిస్తోంది. మరి కాసేపట్లో ఆయన కూడా విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిని కూడా జూబ్లీహిల్స్ ఏసీపీతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విచారిస్తున్నారు. సాక్షుల వాంగ్మూలం, వారు సేకరించిన ఆధారాలతో కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటికి వారి నుంచి సమాధానాలు రాబట్టనున్నారు. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ కేసు బాధితుల జాబితాను పోలీసులు సిద్ధం చేశారు.
…………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
