
* సౌత్ ఎండ్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలిన విమానం
* లండన్ నుండి నెదర్లాండ్స్ కు బయలుదేరిన విమానం
* విమానంలో 13 మంది ప్యాసింజర్లు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం
ఆకేరు న్యూస్ డెస్క్ ః లండన్ లో ఆదివారం రాత్రి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లండన్ సౌత్ ఎండ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన బీ.200 సూపర్ కింగ్ విమానం టేకాఫ్ అయిని కొద్ది సేపటికే కుప్పకూలింది.. విమానం కుప్పకూలడంతో మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సౌత్ ఎండ్ విమానాశ్రయం నుంచి నెదర్లాండ్స్ కు బయలు దేరిన విమానంలో 13 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్లు సమాచారం.. ఈ ప్రమాదంలో ఎంత మంది మృతి చెందారనేది ఇంకా తెలియాల్సి ఉంది.
…………………………………………..