Police seized 10.750 kg of ganja, station ghanpur
* ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల వద్ద రూ.5 లక్షల 37 వేల 5 వందల విలువచేసే గంజాయిని స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ ఎస్.శ్రీనివాస్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి… గంజాయి రవాణా చేస్తున్నట్లు పక్క సమాచారంతో ఎస్ఐ పి.రాజేష్ సిబ్బందితో తాటికొండ క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా హనుమకొండ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న ఓడి 30 జె 0285 నెంబర్ గల బైక్ పై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి విచారించగా వారి వద్ద ఉన్న తెలుపు రంగు సంచిలో సుమారు 10.750 కేజీల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. ఒడిస్సా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కలిమెల మండలం మలబరం గ్రామానికి చెందిన మనోజ్ మడి, నెలకోట గ్రామానికి చెందిన మడకం ముకేష్ లు వారి స్నేహితుడైన జోగ @ భీమ మడకాని వద్ద గంజాయిని తీసుకొని హైదరాబాదుకు తరలిస్తున్నట్లు అంగీకరించారు. ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని వారి నుండి బైక్, ఒక ఫోన్ తోపాటు రూ.5,37,500 ల విలువచేసే 10.750 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
