* కేతిరెడ్డి పెద్దారెడ్డి Vs జేసీ ప్రభాకర్‌రెడ్డి
* ఉద్రిక్తంగా మారిన వాతావరణం
* భారీగా చేరుకున్న పోలీసుల బలగాలు
ఆకేరు న్యూస్, అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో వాతావరణం వేడెక్కింది. చంద్రబాబు మేనిఫెస్టో రీకాలింగ్ కార్యక్రమానికి ఈరోజు తాడిపత్రిలో వైసీపీ ఏర్పాట్లు చేసుకుంది. దీంతో భారీ స్థాయిలో వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి (jC PRABHAKAR REDDY) సవాల్ విసిరారు. ఎలాగైనా అడుపెడతానని ఎలా అడ్డుకుంటారో చూస్తానని కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతి సవాల్ విసిరారు. ఈ క్రమంలో తిమ్మంపల్లిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి(KETHIREDDY PEDDAREDDY)ని పోలీసులు అడ్డుకున్నారు. పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పెద్దారెడ్డి ఇంటికి పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఘాటు విమర్శలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లుగానే పోలీసులు పని చేస్తున్నారని అన్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు ఇప్పుడు నోటీసులు ఇస్తామంటున్నారని, తాను తాడిపత్రి (TADIPATHRI) వైసీపీ ఇన్చార్జినని ఎందుకు వెళ్లకూడదని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రి వెళ్లి తీరతానంటున్నారు. లేదంటే పోలీస్ స్టేషన్ లోనే కూర్చుంటానని అన్నారు. అయితే ఈ నెల 15న వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైసీపీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. మంత్రుల పర్యటన దృష్ట్యా వాయిదా వేసుకోవాలని ఏఎస్పీ రోహిత్‌కుమార్ కోరారు. దీంతో ఈనెల 18న లేదా ఆ తర్వాత సమావేశం నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. పోలీసుల సూచనతో వైసీపీ సమావేశం వాయిదా వేసుకుంది. దాంతో తాడిపత్రిలో హైటెన్షన్‌కి తాత్కాలికంగా బ్రేక్‌పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్లీ సమావేశానికి వైసీపీ ప్లాన్ వేయడంతో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
………………………………………………
