* అప్పటి సీఎం తమకు నచ్చిన చట్టాన్నితెచి.. ప్రజలను ఇబ్బంది పెట్టారు
* ఎవరు ఏం చెప్పినా వినేవారు కాదు
* శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ధరణి ( Dharani ) స్థానంలో కొత్త చట్టం తీసుకురానున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivas reddy ) శాసనసభలో ప్రకటించారు. భూములు ఉన్న రైతులకు భరోసా కల్పించేలా కొత్త చట్టం ఉంటుందని చెప్పారు. అప్పటి సీఎం ఎవరు చెప్పినా వినలేదని, మరో అధికారితో కలిసి ధరణిని రూపొందించారని వెల్లడించారు. తమకు నచ్చిన చట్టాన్ని తెచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ధరణితో ప్రతీ గ్రామంలో సమస్యలేనని పేర్కొన్నారు. పేదల దగ్గర గత ప్రభుత్వం లాక్కున్న ఆస్తులను తిరిగి ఇస్తామని ప్రకటించారు. దేశానికి రోల్ మోడల్ గా ఉండేలా కొత్త చట్టం ముసాయిదా సిద్ధంగా ఉందని వెల్లడించారు. కొత్త చట్టంపై అందరి సలహాలూ తీసుకుంటామన్నారు.
—————————-–