
ఆకేరున్యూస్, హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఇండిగో విమానంలో సాంకేతికలోపం తలెత్తడం కలకలం సృష్టించింది. శంషాబాద్ నుంచి కొచ్చీ వెళ్లాల్సిన ఇండిగో 6ఏ 6707 విమానం టేకాప్ కు సిద్ధం అవుతోంది. అనుకోకుండా సాంకేతికలోపం తలెత్తడంతో విమానం దాదాపు గంటకు పైగా టేకాఫ్ కాకుండా నిలిచిపోయింది. ఆ విమానంలో ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. వారిలో తెలంగాణకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ తదితరులు ఉన్నారు. టేకాఫ్ కాకుండా విమానం నిలిచిపోవడంతో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
————–