Pujita Ponnada
ఆకేరు న్యూస్, సినిమా: ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీధర్ గాదె ప్రస్తుతం ఓ సరికొత్త హారర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ తలారి నిర్మిస్తున్న ఈ సినిమా ఆయన ప్రొడక్షన్ నెం.3గా రూపొందుతోంది.
ఈ చిత్రంలో ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా.. నందు, లిఖిత కథానాయికలుగా కనిపించనున్నారు. పూజిత పొన్నాడ(Pujita Ponnada), సింధు కాసారం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.
నర్తకిగా పూజిత
పూజిత పొన్నాడ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్తకి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. రాజభవనం నేపథ్యంలో నర్తకిమణిగా పూజిత కనిపిస్తున్న ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.
గ్రామీణ నేపథ్యంలో హారర్
గ్రామీణ వాతావరణాన్ని నేపథ్యంగా చేసుకుని ఈ హారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సరికొత్త కథ, విభిన్నమైన కథనంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా దర్శకుడు శ్రీధర్ గాదె సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా కథ, ఇతర పాత్రలు, విడుదలకు సంబంధించిన వివరాలను చిత్రబృందం త్వరలో వెల్లడించనుంది.
ఈ చిత్రంలో ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య తదితరులు నటిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
