Poshala Krishnamurthy Station Ghanpur
* ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటన
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి శివుని పల్లికి చెందిన ‘పోశాల’ కృష్ణమూర్తిని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధికార ప్రతినిధిగా నియమించారు. మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డుల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీలను సోమవారం జరిగిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి టౌన్ అధికార ప్రతినిధిగా ‘పోశాల’ కృష్ణమూర్తిని ప్రకటించారు.
ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ తనకి ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే శ్రీహరి, మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, పట్టణ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వార్డు కమిటీలు, పట్టణ అధ్యక్షులు, మున్సిపాలిటీ చైర్మన్, కౌన్సిలర్ల సహకారంతో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
