* జీవితంలోకి ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారట..
ఆకేరు డెస్క్ : టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రభాస్.. పెళ్లి గురించి ఎప్పుడూ చర్చే. పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేది నిత్యం ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక ప్రభాస్ చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సినిమాలు తప్పితే ఇతర విషయాలపై కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వని ఈ స్టార్ హీరో ఊహించిన విధంగా తన జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు అన్నట్లుగా పోస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభాస్ ఇంతకు ఏ విషయం గురించి ఇలా వివరణ ఇచ్చాడు అనేది కాస్త సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది.
ప్రభాస్ ఏమని పోస్ట్ చేశాడంటే..
డార్లింగ్స్.. ఫైనల్ గా మన జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశించబోతున్నారు.. వెయిట్ చేయండి.. అంటూ ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. దీంతో అందరూ కూడా ప్రభాస్ పెళ్లి విషయంలో ఏదైనా క్లారిటీ ఇస్తాడా అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ విషయంపై ప్రభాస్ పెద్దగా రియాక్ట్ కాడు. ఫ్యామిలీలో కూడా చాలాసార్లు ఈ విషయం చర్చల్లోకి వచ్చింది. కానీ ప్రభాస్ మాత్రం ఎవరికీ సరైన సమాధానం మాత్రం చెప్పడం లేదు. సోలో లైఫ్ సో బెటర్ అనే విధంగానే ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇక ప్రభాస్ లవ్ లో ఉన్నాడు అనే విధంగా చాలామంది హీరోయిన్స్ పేర్లు కూడా గతంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కల్కి సినిమా హడావిడి మొదలయ్యే క్రమంలో ఈ విధంగా పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారుతుంది. ప్రభాస్ నిజంగానే షాక్ ఇస్తాడా లేదంటే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏమైనా ప్లాన్ వేశాడా? అనే విధంగా కూడా మరికొన్ని సందేహాలు కలుగుతూ ఉన్నాయి.
——————————-