*ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు
* అప్రమత్తమైన పోలీసులు
* బాంబు స్క్వాడ్ తనిఖీలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : కాసేపట్లో పేల్చేస్తాం. ప్రజా భవన్లో(Praja Bhavan) బాంబు పెట్టాం.. అంటూ ఏకంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కే ఫోన్ చేశారు. అప్రమత్తమైన పోలీసులు ప్రజా భవన్‌కు చేరుకుని విస్తృతంగా గాలింపు చేపట్టారు. ప్రజా భవన్లో డిప్యూటీ సీయం మల్లు భట్టి విక్రమార్క కుటుంబం నివాసం ఉంటున్నారు. హుటా హుటిన పోలీసులు అక్కడకు చేరుకుని బాంబు స్క్వాడ్ గాలింపు చేపట్టారు.
ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షున్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి.
ప్రజాభవన్ లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్‌ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు . ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయి పనుల కోసం చేశాడా ..? ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
—————————