* త్వరలో అధికారిక ప్రకటన
ఆకేరు న్యూస్ డెస్క్ : టీమిండియాకు త్వరలోనే కొత్త కోచ్ రానున్నారు. ప్రస్తుత హెడ్ కోచ్ ద్రావిడ్ పదవీ కాలంలో వచ్చే నెలలో ముగియడంతో ఈ మేరకు బీసీసీఐ కొత్త కోచ్ నియామకంపై దృష్టి సారించింది. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ద్రావిడ్ కు సూచించగా ఆయన అనాసక్తి తెలిపారు. అనంతరం ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ ను బీసీసీఐ స్పంప్రదించగా, ఆయన కూడా ఆసక్తి చూపనట్లు తెలిసింది. దీంతో గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) తో సంప్రదింపులు జరిపింది. దాదాపు నాలుగు గంటల పాటు బీసీసీఐ సెక్రటరీ జైషా, తదితరులతో జరిగిన సమావేశంలో గౌతమ్ ఆసక్తి కనబరిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండా నేరుగా గౌతమ్ గంభీర్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఛాంపియన్‌గా నిలవడంలో మెంటార్‌గా గంభీర్‌ది కీలక పాత్ర పోషించారు. గత సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ కు కూడా అతను మెంటార్‌గా వ్యవహరించారు. టీమీండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ నియామకంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. హెడ్ కోచ్‌గా గౌతమ్ ఎంపికైతే 2027 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
—————————–