* ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలి
– మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్లో(Praja Bhavan) ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియడంతో 10వ తేదీన జిహెచ్ఎంసి(GHMC) ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ఆమ్రపాలి కాటా(Amrapali Kata), మేయర్ గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Viajayalakshmi), డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉన్నందున జిహెచ్ఎంసి లో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం ప్రతి సోమవారం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 27 విన్నపాలు వచ్చాయని దాంతో పాటు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 8 విన్నపాలు వచ్చాయన్నారు, వీటన్నింటినీ వారం రోజుల్లో పరిష్కరించడం జరుగుతుందన్నారు. సమస్యలను సకాలంలో పరిష్కరించని పక్షంలో సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎక్కువగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రాపర్టీ టాక్స్ లకు సంబంధించిన ఆర్జీలు ఎక్కువగా వచ్చయని వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను అధికారులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ కే శ్రీవాత్సవ, శివ కుమార్ నాయుడు, నళిని పద్మావతి, గీత రాధిక, సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, యాదగిరి రావు, సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్దుల్ వకీల్, చీఫ్ ఎంటమాలజి డాక్టర్ రాంబాబు, ట్యాక్స్ వాల్యుయేషన్ ఆఫీసర్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.
———————