
* బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో విచారణకు హాజరు
* త్వరలో మరికొందరు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసులో ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ (Prakashraj) ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీరాబాగ్‌లోని ఈడీ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఈడీ భావిస్తోంది. ఈ క్రమంలో విచారణ నిమిత్తం సినీ నటులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో ప్రకాష్ రాజ్ తోపాటు రానా(Rana), మంచు లక్ష్మీ (Manchu Laxmi)తదితరులు ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, మనీ ల్యాండరింగ్ కోణాల్లో ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. టెక్ దిగ్గజాలు గూగుల్, మెటాలకు కూడా సమన్లు పంపింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో గూగుల్, మెటాలను విచారించనుంది ఈడీ. యూట్యూబ్(Youtube), ఇన్స్టాగ్రామ్(Instagram), ఫేస్బుక్(Facebook), ఎక్స్, షేర్‌చాట్, స్నాప్‌చాట్ ఇలా ఏ యాప్ ట్రెండింగ్‌లో ఉంటే.. అందులో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు సెలబ్రిటీలు. ఈ క్రమంలో విచారణలో భాగంగా గూగుల్, మెటాకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదే క్రమంలో ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని ప్రకాష్‌రాజ్‌కు, ఆగస్టు 13న ఎంక్వైరీకి రావాలని ఈడీకి మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌లతో జరిగిన అగ్రిమెంట్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రావాలని టాలీవుడ్ సెలబ్రిటీలను ఆదేశించింది. ఇక ఇదే కేసులో పేర్లున్న మిగతా నటీనటులకు సైతం దశలవారీగా సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
………………………………………………