
* ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలపై నిరసనకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ శ్రేణులు
* నేడు నియోజకవర్గంలో పర్యటించనున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీతక్క
* ముందుస్తు చర్యగా బిఆర్ ఎస్ నాయకుల అరెస్ట్
ఆకేరు న్యూస్ ములుగు ః ములుగు జిల్లా వ్యాప్తంగా బి ఆర్ ఎస్ నాయకులను వేకువ జామున్నే పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. తాడ్వాయి,ఏటూర్ నాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు ,తదితర మండలంలోని బి ఆర్ ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు .అంతేకాకుండా ఏటునాగారంలోన బి ఆర్ ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ్ బాబుతో పాటు కార్యకర్తలను పోలీసులు అడుకున్నారు. ఇటీవల ఇందిరమ్మ గృహాలు అర్హులైన వారికి మంజూరు కాలేదని పలు గ్రామాలలో బి ఆర్ఎస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు . ఇందులో భాగంగా కన్నాయిగూడెంలో నాగేశ్వరరావు చలువాయిలో రమేష్ అనే వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టారు. నేడు ములుగు జిల్లా కేంద్రంలో శాంతియుత నిరసన తెలిపేందుకు టిఆర్ఎస్ నాయకులు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు . అయితే ఈరోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో పాటు స్థానిక మంత్రి సీతక్క ఏజెన్సీలో పని అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అరెస్టు ప్రక్రియ కొనసాగిస్తున్నారు.ఈ సందర్భంగా ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ భౌతిక దాడులకు నిరసనగా శాంతియుత వాతావరణం లో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడానికి బయలుదేరుతున్న ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తో పాటు పలు మండలాల్లోని నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టు చేయడాన్నితాము తీవ్రంగా ఖండిస్తూ న్నారని తెలిపారు.
……………………………………………………..