* ఈ నెల 21, 22న రాక
* ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన సీిఎస్ శాంతికుమారి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు నగరంలో భారత రాష్ట్రపతి ముర్ము (murmu) పర్యటించనున్న నేపథ్యంలో ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి (cs shanthikumari)ఉన్నతాధికారుల తో సమావేశమయ్యారు. కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించేందుకు మాన్యువల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆమె ఆదేశించారు. పోలీసు శాఖ తగిన భద్రతా ఏర్పాట్లు, సరైన ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని అన్నారు. అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు అన్ని వేదికల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. వైద్యారోగ్యశాఖ సహాయక సిబ్బందితో పాటు అర్హులైన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రాష్ట్రపతి బస చేసే ప్రదేశం పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీ అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ బీ వెంకటేశం, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమీషనర్ హరీశ్, అధికారులు పాల్గొన్నారు.
………………………………