Published:
Updated: 14 Nov 2024 • 07:09 AM
ఆకేరున్యూస్ డెస్క్: హైదరాబాద్‌లోని హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలకు సంబంధించి సమాచారం అందడంతో నార్కోటిక్ అధికారులు హబీబ్ నగర్ మాంగర్ బస్తీకి వెళ్లారు. వీరి రాకను గుర్తించిన పాత నేరస్తుడు, గంజాయి వ్యాపారి కంబ్లీ దీపక్ పరారయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటపడి పట్టుకున్నారు. స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేస్తుండగా దాదాపు వంద మంది పోలీసులపై దాడికి దిగారు. బీర్ బాటిల్‌తో కొట్టడంతో ఎస్ఐ శివకుమార్ తలపై గాయమైంది. మెడలోని రెండు తులాల బంగారు గొలుసు పోయింది.
……………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
