* త్రివేణి సంగమంలో పుణ్యస్నానం
ఆకేరు న్యూస్, డెస్క్ : ఉత్తరప్రదేశ్(Uttarpradhesh)లో జరుగుతున్న ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ప్రధాని మోదీ (Modi)చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. సంగమ్ (Sangam)వద్ద పడవలో విహరించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ (Up Cm Yogi Adityanath)కూడా ఉన్నారు. మోదీ దాదాపు అరగంట పాటు స్నాన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మోదీ పర్యటన నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతోపాటు కుంభమేళా దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి నుంచి అరైల్ ఘాట్‌కు విచ్చేశారు. ఘాట్ నుంచి బోటులో ప్రయాణించి మహా కుంభమేళా జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అనంతరం గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం ఆచరించారు. తిరిగి బోటులో ఆ ప్రాంతం నుంచి అరైల్ ఘాట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత అరైల్ ఘాట్ నుంచి ప్రయాగ్‌రాజ్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ (Delhi) బయల్దేరుతారు.
………………………………