Telangana BJP Leaders Meeting
అకేరు న్యూస్ హైదరాబాద్: బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఇవాళ మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించనున్న దీక్షపై ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా 22-ఏ జాబితాలో భూముల అంశం, బాధితుల సమస్యలపై పార్టీ చేపట్టనున్న ఆందోళన కార్యాచరణకు నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సెప్టెంబర్ 5, 6 తేదీల్లో ఇందిరాపార్క్ వద్ద ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బాధితులతో కలిసి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇటీవల బీజేపీ ప్రకటించింది.
సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటాల అంశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
