రష్యాలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.
* 9న ఆస్ట్రియా సందర్శన
ఆకేరు న్యూస్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రేపు రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. ఆయన పర్యటన వివరాలను విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఇప్పటికే వెల్లడించారు. జూలై 8 నుంచి 10 వరకు ప్రధాని పర్యటన సాగనుంది. ఉక్రెయిన్పై రష్యా దళాల దాడులు జరుగుతున్న క్రమంలో 5 ఏళ్ల తరువాత మోదీ తొలిసారి రష్యాలో పర్యటించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆహ్వానం మేరకు మోదీ రష్యాలో పర్యటిస్తారు. జులై 8న క్రెమ్లిన్లోని ఓ సైనికుడి సమాధి వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తరువాత మాస్కోలోని ప్రదర్శన వేదికను సందర్శిస్తారు. 22వ భారత్- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొని, 9న ఆస్ట్రియాకు బయల్దేరుతారు. 40 సంవత్సరాల తరువాత ఆస్ట్రియాలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
