తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా కే. కేశవరావు నియామకం
* ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు
* కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూడు రోజుల క్రితం కాంగ్రెస్లో చేరిన కె. కేశవరావు (K. Keshava Rao) కు రాష్ట్ర ప్రభుత్వం కీలక పదవి కేటాయించింది. నిన్న రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారుడిగా ఆయనను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎఫైర్స్కు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారని.. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) సమక్షంలో కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ చేరిన కేకే తన పదవికి ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే గురువారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఒకపార్టీ నుంచి పదవి పొంది మరో పార్టీలో చేరినప్పుడు రాజీనామా చేయడం నైతిక బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందుకే రాజీనామా చేసినట్టు కేకే వివరించారు.
——————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
