
నీట్ రద్దుపై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనలు.. విచారణ గురువారానికి వాయిదా
* సుప్రీంకోర్టు ఆదేశాలు
ఆకేరు న్యూస్ డెస్క్ : శిక్షా కాలం పూర్తి చేసిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. శిక్షా కాలాన్నిరివార్డు లేకపోయినా పూర్తి చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కూడా ఆదేశించింది. తమ ఆదేశాన్ని జాతీయ న్యాయ సేవా ప్రాధికార (NALSA) సభ్య కార్యదర్శికి పంపాలని, అక్కడి నుంచి రాష్ట్రాల్లోని జిల్లా న్యాయ సేవా సంస్థలకు పంపించాల్సిందిగా స్పష్టం చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హోమ్ సెక్రటరీలకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పరిధిలో శిక్షా కాలాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా జైల్లో ఖైదీలు కొనసాగుతున్నారా అనే విషయాన్ని వెంటనే పరిశీలించాలని ఆదేశించింది . అలాంటి ఖైదీలు ఇతర కేసుల్లో అవసరం లేకపోతే, వారిని తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
……………………………………..