* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డుపై ధర్నా
ఆకేరు న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. ఈరోజు ఏకంగా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. సరైన సమయంలో సాగు నీరందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో రోడ్డుపై ధర్నా చేశారు. తాగునీటి కొరత విపరీతంగా ఉందని.. బుక్కెడు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. సాగునీరు అందికలేకపోతున్న ప్రభుత్వం కనీసం తాగు నీరయినా ఇవ్వలేదా? అంటూ ఖాళీ బిందెలతో ఖమ్మం- కొత్తగూడెం రహదారిపై గ్రామస్థులు నిరసనకు దిగారు. నెలలుగా నీటి కష్టాలతో జీవితాలు ఈడ్చుకోస్తున్నామని, గ్రామానికి నిరంతరం నీటి సౌకర్యం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
———————