* ఆదిలాబాద్ లో రైతుల ఆందోళన
* విత్తనాల తరలింపు వాహనం అడ్డగింత
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : పత్తి విత్తనాల కోసం రైతులు మూడు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. దుకాణాల వద్ద నో స్టాక్ బోర్డులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు పత్తి విత్తనాల తరలింపు వాహనాన్ని అడ్డుకున్నారు. వ్యాపారులు ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారని, విత్తనాల పంపిణీ, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని పంజాబ్ చౌక్‌లో రైతులు ధర్నా చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తనాల కొరత తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
—————————-