* అల్లు ఇంటికి సినీ ప్రముఖులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చంచల్‌గూడ జైలు నుంచి సినీ హీరో అల్లు అర్జున్(HERO ALLU ARJUN) విడుదల అయ్యారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ఆయనను హైదరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తొలుత నాంపల్లి కోర్టు(NAMPALLI COURT) ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించగా, తర్వాత హైకోర్టు(HIGH COURT) మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి కోర్టు ఆదేశాలతో అల్లు అర్జున్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. తర్వాత హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ, ఆ తీర్పు పత్రాలు జైలు అధికారులకు రాత్రి ఆలస్యంగా అందాయి. దాంతో, ఆయన రాత్రంతా జైలులోనే ఉండాల్సి వచ్చింది. చంచల్‌గూడ జైలు(CHANCHALGUDA JAIL)లోని మంజీరా బ్యారక్‌లో అల్లు అర్జున్ను ఉంచారు. ఉదయం ఆయనను విడుదల చేశారు. బయటకు వచ్చిన తర్వాత బన్నీ మాట్లాడుతూ.. తాను బాగానే ఉన్నానని ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. తాను చట్టాన్ని గౌరవిస్తా అని చెప్పారు. 20 ఏళ్లుగా థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని, పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటన బాధాకరమన్నారు. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జైలు నుంచి నేరుగా అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకుని భార్యాపిల్లల్ని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు.
అల్లు ఇంటికి సినీ ప్రముఖులు
అల్లు అర్జున్ కు తెలుగు పరిశ్రమ బాసటగా నిలిచింది. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకుని సినీ ప్రముఖులు సంఘీబావం తెలుపుతున్నారు. నిర్మాతలు, దర్శకులు, హీరోలు దేవరకొండ సోదరులు, సుకుమార్(SUKUMAR), వంశీ పైడిపల్లి(VAMSI PYDIPALLI), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, పుష్ప టీమ్ తదితరులు ఆయన నివాసానికి చేరుకున్నారు.
……………………………………